హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

సత్యసాయి: ప్రజల నుంచి ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమంలో వచ్చిన తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తాగునీటి సరఫరా, పైప్‌లైన్‌ లీకేజీలపై 22 ఫిర్యాదులు అందాయన్నారు. RWS, పంచాయతీరాజ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకోవాలన్నారు.