హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పణుకువలసలో కుంగిపోయిన వంతెన పరిశీలన

VZM: తెర్లాం (మం) పణుకువలస గ్రామం వద్ద కుంగిపోయిన వంతెనను ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా డైవర్షన్ రోడ్డు సత్వరమే నిర్మించాలని సూచించారు. నూతన వంతెన, డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి రూ.2.8 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.