హైదరాబాద్: 28°C
తెలంగాణ

సొమ్మొకరిది.. సోకొకరిది: BRS

BDK: అశ్వాపురం మండల కేంద్రంలో BRS నాయకులు ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ కలల స్వప్నం సీతారామ ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.25 కోట్ల వ్యయంతో లెఫ్ట్ కెనాల్ మాత్రమే నిర్మించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పోరాట ఫలితమే లెఫ్ట్ కెనాల్ నిర్మాణం జరిగిందన్నారు. సొమ్మొకరిదైతే, సోకొకరుదని ఎద్దేవా చేశారు.