KMR: భిక్కనూర్ మండల పరిధిలోని పౌల్ట్రీ పరిశ్రమపై సోమవారం కాచాపూర్ గ్రామ సచివాలయ పాలకవర్గ సభ్యులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. వాన నీటి ద్వారా కోడి ఎరువు గ్రామ శివారులోని పెద్ద చెరువులోకి రావడంతో దుర్వాసన వస్తోందని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దశరథం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
పౌల్ట్రీ పరిశ్రమపై కలెక్టర్‌కు ఫిర్యాదు


