హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్యే

ATP: విద్యార్థులు.. ఉద్యోగాలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా, భవిష్యత్తులో పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం ప్రభుత్వ బాలుర ఐటీఐలో సోమవారం ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా (PMNAM) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసంగించారు.