హైదరాబాద్: 28°C
క్రీడలు

అధిక బరువు.. ఫైనల్‌కు దూరం

ఆసియా క్రీడల్లో భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ సుచికా తరియాల్ సెమీస్‌లో డ్రా కావడంతో, బరువు నిబంధన కారణంగా ఫైనల్ చేరలేకపోయింది. ప్రత్యర్థి కంటే 700 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమె తృటిలో స్వర్ణావకాశం కోల్పోయింది. అయినప్పటికీ, కాంస్య పతకం సాధించి భారత్ తరఫున ఎంఎంఏలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా సుచిక అరుదైన చరిత్ర సృష్టించింది.