ASR: కలెక్టరేట్‌లో మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి కలెక్టర్ నిశాంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘కన్యాశుల్కం’ ద్వారా దురాచారాలు, మూఢనమ్మకాలపై గురజాడ చైతన్యం కల్పించారని తెలిపారు. ‘దేశమంటే మట్టి కాదోయ్’ సందేశం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన సమాజ శ్రేయస్సుకు కృషి చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు


