హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మునగాకు బొకేలతో 'పోషణ్ మాహ్' అవగాహన

సత్యసాయి: జిల్లాలో నిర్వహిస్తున్న 'పోషణ్ మాహ్' వేడుకల్లో భాగంగా అధికారులు మునగాకు బొకేలతో వినూత్న అవగాహన కల్పించారు. పూల బొకేలకు బదులు మునగాకు బొకేలను అందిస్తూ దాని ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. మునగాకులో క్యాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని, ఇది రక్తహీనతను నివారిస్తుందని అధికారులు తెలిపారు.