హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటిమట్టం పెరుగుతోంది.. భక్తులు జాగ్రత్త: ఎస్సై

MDK: గణేశ్ నిమజ్జనోత్సవాన్ని భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై రాజేష్ కోరారు. వర్షాల కారణంతో చెరువులు, కుంటల్లో నీటి ఉద్ధృతి పెరిగినందున విగ్రహాల నిమజ్జన సమయంలో తీవ్ర అప్రమత్తత అవసరమన్నారు. నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలకు తావులేకుండా చూడాలన్నారు. నిమజ్జనం విజయవంతం అయ్యేలా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.