హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

శ్రీకాకుళం (M) కిష్టప్పపేటలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఎమ్మెల్యే శంకర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. స్థానిక ప్రజలను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.