హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై సీపీఎం కరవు బృందం పరిశీలన

KRNL: పత్తికొండ నియోజకవర్గంలో సీపీఎం కేంద్ర కమిటీ కరవు బృందం సోమవారం పర్యటించింది. లోకనాథ్, రాధాకృష్ణ, ఆనంద్‌బాబు, అంజిబాబు పంట నష్టాలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో ఉల్లి, టమాటా, మిరప, ఆముదం, సద్ద, జొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి రూ.లక్ష కోట్ల సహాయం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.