హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీరు విడుదల చేయాలని ధర్నా

GDWL: జూరాల ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గద్వాల పట్టణ పరిధిలోని జమ్మిచేడు వద్ద కర్నూలు జాతీయ రహదారిపై బైఠాయించారు. రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇచ్చినా 48 గంటలు గడిచినా అమలు కాలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.