హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అందుల ఉన్నత పాఠశాల విద్యార్థికి ప్రథమ స్థానం

KDP: కడప వైఎస్సార్ స్టేడియంలో నిర్వహించిన ఇండియా ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ పోటీల్లో అందుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి మేడ సుబ్బు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విభాగంలో ప్రథమ స్థానం సాధించాడు. రూ. 2,000 నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్ అందుకున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సుబ్బును అభినందించారు.