హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతు సమస్యలు వెంటనే పరిష్కరించాలి'

అన్నమయ్య: చిట్వేల్‌ మండల రైతుల భూ సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర, ఎరువుల సమస్యలు, పంట రుణాల మాఫీ, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ నరసింహారావుకు రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు.