హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి'

VSP: లంకెలపాలెం బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టిసత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డ లంకెలపాలెం బ్రిడ్జిని పరిశీలించారు. హిందూజా బొగ్గు లారీలు అధిక లోడుతో ప్రయాణించడం వలన ఈ బ్రిడ్జి ఈ దుస్థితికి వచ్చిందని అన్నారు. వెంటనే బ్రిడ్జికి శాశ్వతమైన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.