RR: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 5వ రోజు ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్దకు చేరుకుంది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం బీసీల అభివృద్ధికి రాజ్యాధికారమే మార్గమని అన్నారు.
తెలంగాణ
మొగిలిగిద్దలో తీన్మార్ మల్లన్న పర్యటన


