హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాచకుల ఆకలి తీర్చిన సాజన్ ట్రస్ట్ సేవ

BDK: మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాజన్ దివ్యాంగుల, వృద్ధుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఇల్లందు పట్టణంలో అనాధలకు అన్నాన్ని అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా కేవలం మానవత్వంతో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.