హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 58 దరఖాస్తులు

NGKL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 58 దరఖాస్తులు అందాయి. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను సంబంధిత శాఖలు సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కార వివరాలను ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా తెలియజేయాలని సూచించారు.