హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 9 శాతం లోటు వర్షపాతం

SRCL:జిల్లాలో సోమవారం ఉదయం 8:30 గంటల వరకు సగటున 6 మి.మీ. వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 677 మి.మీ. వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం 743.3 మి.మీ.తో పోలిస్తే 9 శాతం లోటు నమోదైంది. బోయినపల్లి, కోరుట్ల మండలాల్లో అధిక వర్షపాతం నమోదవగా, రుద్రంగి, చందుర్తి, సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఇల్లంతకుంటలో లోటు వర్షపాతం నెలకొంది.