హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్చకుడి కుటుంబానికి ఆర్థిక సాయం

JGL: ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామానికి చెందిన ధూపదీప నైవేద్య అర్చకుడు సింహాచలం జగన్ కుటుంబానికి అర్చక సమాఖ్య సంక్షేమ సంఘం అండగా నిలిచింది. జిల్లా, రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో జగన్ కుటుంబానికి రూ.1,08,720 ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కష్టసుఖాల్లో అండగా ఉంటామని భరోసా కల్పించారు.