హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్మశాన వాటికలో అక్రమ కబ్జా దుకాణాలు తొలగించాలి'

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ ఎదురుగా ఉన్న మైనారిటీ ముస్లిం స్మశాన వాటిక, ఈద్గా స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, షెడ్లను తొలగించి స్థలాన్ని పరిరక్షించాలని ముస్లిం సోదరులు అధికారులను కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.