హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్ర వినాయకుడి వద్ద యజ్ఞ కార్యక్రమం

NRML: జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆవరణలో గణేశ్ నవరాత్రుల సందర్భంగా కొలువుదీరిన కర్ర వినాయకుడి వద్ద యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.