హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలంపూర్‌లో ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

GDWL: ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్దన్ దంపతులు సోమవారం అలంపూర్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు.