హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డితో ఇబ్బందులు.. చర్యలు చేపట్టాలి

VKB: బంట్వారం మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో గడ్డి విపరీతంగా పెరగడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్డి నివారణ మందు పిచికారీ చేయకపోవడంతో గ్రామస్తులే గడ్డిని తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి గడ్డిని పూర్తిగా తొలగించి, మళ్లీ పెరగకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.