హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్‌తో యువకుడి మృతి

BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి అఖిల్(21) మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్‌తో మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అఖిల్‌కు కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అఖిల్ మృతితో తిరుమలగిరి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.