హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం: సీతక్క

MLG: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం బాపూజీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రి నివాళులు అర్పించారు. తెలంగాణ హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అన్నారు.