AKP: నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజారావు తెలిపారు. సోమవారం సిబ్బందితో కలిసి నర్సీపట్నం–చింతపల్లి రహదారిలోని నెల్లిమెట్ట వద్ద కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సీసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'CC కెమెరాలు ఏర్పాటు'


