HYD: హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లోని జూపిటర్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని వాహనాలకు వ్యాపించడంతో రెండు కార్లు, రెండు బైక్‌లు, ఓ సైకిల్ దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
తెలంగాణ
అగ్నిప్రమాదం.. రెండు కార్లు, రెండు బైక్‌లు దగ్ధం


