VSP: హనుమంతవాక జంక్షన్ సమీపంలో మినీ మాస్ట్ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతం చీకటిమయంగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, మినీ మాస్ట్ దీపాలకు మరమ్మతులు చేపట్టి వెలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలగని మినీ మాస్ట్ దీపాలు


