హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయంలో గురుజాడ జయంతి వేడుకలు

SKLM: సంతబొమ్మాళి శాఖా గ్రంథాలయంలో గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను ఇవాళ నిర్వహించారు. గ్రంథాలయ అధికారి కే. రామకృష్ణ గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ సాహిత్య విశిష్టత, ‘కన్యాశుల్కం’ నాటకం, వాడుక భాషా ఉద్యమానికి ఆయన చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో రీడర్స్‌తో పాటు ఎంపీపీ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.