హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్‌ గణేశ్ దర్శనానికి ఎల్లుండే లాస్ట్..!

HYD: ఖైరతాబాద్‌ బడా గణేశ్ దర్శనానికి సెప్టెంబర్‌ 23 లాస్ట్ అని ఉత్సవ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్‌ 23 రాత్రి 11:59 గం. వరకు మాత్రమే భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 24న నిమజ్జన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు పేర్కొంది. భక్తులు 2 రోజుల్లో సరైన సమయాన్ని ప్లాన్‌ చేసుకొని కుటుంబ సమేతంగా దర్శించుకోవాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.