హైదరాబాద్: 28°C
తెలంగాణ

MGMను సందర్శించిన కలెక్టర్, డీఎంఈ

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ సత్యశారద, వైద్య విద్య సంచాలకురాలు (డీఎంఈ) డా. వాణి సందర్శించారు. ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పలు వార్డులు, ఓపీ విభాగాన్ని పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. అవసరమైన ఏర్పాట్లు, సేవలను మెరుగుపర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు.