హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహా భోగం

MHBD: తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామంలో శ్రీ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా  వైవిధ్యమైన నైవేద్యాలతో ‘మహా భోగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.