SRD: సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బేలపూర్‌లో విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. సమయానికి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులను సక్రమంగా నడిపి తమ ఇబ్బందులు తొలగించాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో అక్కడ కొంతసేపు ట్రాఫిక్ నిలిచింది.
తెలంగాణ
VIDEO: బస్సుల కోసం విద్యార్థుల ధర్నా


