హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాణ్యమైన బియ్యం అందించాలని ఆదేశం'

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంజేపీ గురుకులాల్లో నాణ్యమైన బియ్యం అందించాలని ABSF జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ సెక్రటరీ సైదులు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఆర్‌సీవో, డీసీవోలతో మాట్లాడి అన్ని గురుకులాల్లో నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. సెక్రటరీకి ABSF రాష్ట్ర, జిల్లా కమిటీల పక్షాన ధన్యవాదాలు తెలిపింది. విద్యార్థుల విషయంలో రాజీ లేకుండా పని చేయాలని ఆయన అన్నారు.