రిటైరైన క్రికెటర్ల ఆరోగ్య ఖర్చుల కోసం అందించే ఆర్థిక సాయాన్ని BCCI పెంచనుంది. ఇప్పటివరకు రూ.10 లక్షలు అందించగా.. ఇకపై రూ.15 లక్షలు ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని BCCI అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండీశ్వరీనాథ్ ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించారు. అలాగే, 5-24 మధ్య ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు కూడా రూ.30 వేల పింఛను పథకాన్ని వర్తింపజేయాలని కోరాడు.
క్రీడలు
రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ సాయం పెంపు


