JGL: వినాయకుడి నిమజ్జనం సందర్భంగా పెగడపల్లి మండలంలో డీజేలకు పర్మిషన్ లేదని సోమవారం ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. డీజే శబ్దాలతో ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు. నిమజ్జన వేడుకల్లో డీజేలు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.


