SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వెంగల చెరువు కట్టకు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామ కార్యదర్శికి గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. కట్టపై ఉన్న పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని కోరారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.


