SRD: సదాశివపేట పట్టణంలో ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నేడు సందర్భంగా పద్మశాలి సంఘం, చేనేత సహకార సంఘం సంయుక్తంగా ఘనంగా నివాళులుర్పించాయి. సంఘ అధ్యక్షుడు చింతా గోపాల్ ఆధ్వర్యంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమంలో, చేనేత కార్మికుల సంక్షేమానికి బాపూజీ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి.. ఘన నివాళి


