MBNR: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని పోలీసులు ఈ రోజు ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నా నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అన్నాసాగర్ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
జూరాల ధర్నా నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్


