హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురజాడ అప్పారావుకు జేసీ విష్ణుచరణ్ నివాళి

ATP: మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వస్తున్న మార్పులను ముందే ఊహించి, తన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని రగిలించిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు.