హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం

KMR: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పట్టణ పద్మశాలి సంఘ ప్రతినిధి శ్రీనివాస్ సూచించారు. సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.