హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'

NZB: సిరికొండ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల వద్ద సోమవారం సిరికొండ ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ తదితరాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై రామకృష్ణ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.