MBNR: జడ్చర్ల పట్టణంలోని సాయి నగర్ కాలనీలో సకల దేవతల గుడి ఎదురుగా డ్రైనేజీ సౌకర్యం లేక తాత్కాలికంగా తవ్విన గుంత చెత్తతో నిండిపోయింది. దీంతో మురుగు నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తతో నిండిన కాలువను మున్సిపల్ సిబ్బందితో వెంటనే శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
సాయి నగర్ కాలనీలో రోడ్డుపైకి మురుగు నీరు


