KMM: రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన జాటోత్ నవ్య బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూసింది. ఆదివారం అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. నవ్యకు భర్త, కుమార్తె ఉన్నారు. భర్తతో విడాకులు కావడంతో తండ్రి వద్దే నివాసముంటోంది. నవ్య అకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
తెలంగాణ
బ్రెయిన్ స్ట్రోక్‌తో యువతి మృతి


