హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ర్యాలీపై ఉత్కంఠ..!

కృష్ణా: విజయవాడలో వైసీపీ ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ శాప్ ఆఫీస్ ముందు ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం నిర్వహించిన DSC అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతూ ర్యాలీకి సిద్ధమైనట్లు వైసీపీ నాయకులు తెలిపారు. పోలీసులు వైసీపీ నిర్వహిస్తున్న ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు.