హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాజీ మంత్రి హౌస్ అరెస్ట్!

WNP: పానగల్ మండలం కొత్తపేటలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వనపర్తిలోని ఆయన నివాసానికి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్ట్‌కు గల కారణాలపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.