హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు బస్సు లేక ఇబ్బందులు

NLR: చేజర్ల మండలంలోని గొల్లపల్లి విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. సంగం- చేజర్ల మార్గంలో ఉదయం 8:30కు వెళ్లే బస్సును వారం రోజులుగా 9.30 గంటలకు మార్చారు. చేజర్ల జిల్లా పరిషత్‌హై స్కూల్‌కు విద్యార్థులు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తుంది. సంగం నుంచి గొల్లపల్లి సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.