ప్రకాశం: బేస్తవారిపేట మండలం కోనపల్లి అడ్డరోడ్డు సమీపంలోని ఓ పొలంలో సోమవారం విద్యుత్ వైరు తెగి కంచెపై పడటంతో రైతు రాధామోహన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. విద్యుత్ వైరు కంచెపై పడిన విషయాన్ని గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి


