హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోన రఘుపతిని అరెస్టు చేసిన పోలీసులు

BPT: తాడేపల్లిలో డీఎస్సీ అక్రమాలపై జరిగే నిరసనలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బాపట్ల మండలం చుండూరుపల్లి వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాపట్ల రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం.